వ్యాధి లక్షణాలను త్వరగా నిర్ధారించాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:21 AM
ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే సర్వే, స్ర్కీనింగ్‌ల్లో వైద్య సిబ్బంది గుర్తించిన వ్యాధి లక్షణాల నిర్ధారణ త్వరగా జరిగేలా వైద్యాధికారులు కార్యాచరణ చేయాలని జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు కోరారు.
సీతానగరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే సర్వే, స్ర్కీనింగ్‌ల్లో వైద్య సిబ్బంది గుర్తించిన వ్యాధి లక్షణాల నిర్ధారణ త్వరగా జరిగేలా వైద్యాధికారులు కార్యాచరణ చేయాలని జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు కోరారు. శుక్రవారం మండలంలోని నీలకంఠాపురంలో సంచార చికిత్సాశిబిరాన్ని తనిఖీ చేశారు. మందులు, వైద్య పరీక్షలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. సర్వే, స్ర్కీనింగ్‌లు ఏ మేరకు పూర్తి చేశారో ఆన్‌లైన్ నమోదు పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి ముస్తాబు, ఇతర ఆరోగ్య అంశాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీ, షుగర్, క్యాన్సర్ లక్షణాలు గుర్తించే లక్ష్యంగా ఎన్‌సీడీ సర్వే, 4డీ లక్షణాలపై ఆర్‌బీఎస్‌కే స్ర్కీనింగ్‌లో గుర్తించిన వారికి సంచార చికిత్సా శిబిరాల్లో ఎప్పటికప్పుడు వైద్యాధికారులు నిర్ధారణ జరిపి తదుపరి చికిత్స, పర్యవేక్షణ జరిగేలా త్వరగా కార్యాచరణ చేయాలన్నారు క్యాన్సర్ లక్షణాలతో గుర్తించిన వారిని తప్పనిసరిగా పీవోయూ కేంద్రాల్లో తుది నిర్ధారణ జరిగేలా చూడాలన్నారు. దీర్ఘకాలిక రోగులను ప్రతి నెలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.శ్రీకాంత్, వైద్య సిబ్బంది జె.జయలక్ష్మి, 104 సిబ్బంది పాల్గొన్నారు.