Sweet talk for DCMS డీసీఎంఎస్‌కు తీపికబురు
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:22 AM
Sweet talk for DCMS ల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కి కొత్త ఏడాది ప్రారంభంలోనే తీపికబురు అందింది. వైసీపీ హయాంలో సచివాలయాల్లో ఫర్నీచర్‌కు సంబంధించిన కాంట్రాక్టు డీసీఎంఎస్ చేపట్టింది. జిల్లాలోని అన్ని సచివాలయాలకు ఫర్నిచర్‌ను సరఫరా చేసింది.
డీసీఎంఎస్‌కు తీపికబురు
రూ.కోటీ 90 లక్షల పాత బకాయి విడుదల
తాజాగా విజయనగరం కార్పొరేషన్ నుంచి రూ.50 లక్షల కాంట్రాక్టు
విజయనగరం రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కి కొత్త ఏడాది ప్రారంభంలోనే తీపికబురు అందింది. వైసీపీ హయాంలో సచివాలయాల్లో ఫర్నీచర్‌కు సంబంధించిన కాంట్రాక్టు డీసీఎంఎస్ చేపట్టింది. జిల్లాలోని అన్ని సచివాలయాలకు ఫర్నిచర్‌ను సరఫరా చేసింది. ఇందుకు గాను రూ.6కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉండగా రూ.4 కోట్ల 10 లక్షలు మాత్రమే 2023లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా డీసీఎంఎస్‌కి రావాల్సిన రూ.కోటీ 90 లక్షల బకాయి ఉండిపోయింది. 2023 డిసెంబరు నాటికి ఈ నిధులు విడుదల అవుతాయని ఆశించినా విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీసీఎంఎస్‌లకు చైర్మన్‌లను నియమించింది. వీటిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలుపై తొలుత దృష్టి పెట్టింది. ఇదే విషయమై డీసీఎంఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గొంప కృష్ణ కూడా పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.కోటి 90 లక్షలను డీసీఎంఎస్‌కు విడుదల చేసింది.
- ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీసీఎంఎస్‌కు విజయనగరం నగర పాలక సంస్థ రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చింది. 2025-26కి సంబంధించి నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, అవుట్ సోర్సింగు పారిశుధ్య కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో సిబ్బందికి వస్త్రాలు ( చీరెలు, జాకెట్లు, తువ్వాళ్లు) ఖాకీక్లాత్ 2,405 మీటర్లు, వైట్ క్లాత్ 31.5 మీటర్లు, 1.923 తువ్వాళ్లను సప్లయ్ చేసే కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకు గాను నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించింది. వీటన్నింటిని మార్చి 31లోగా నగరపాలక సంస్థకు డీసీఎంఎస్ అందించాల్సి ఉంది.