వాడవాడలా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:36 AM
స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శని వారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాడవాడలా పా రిశుధ్య పనులు చేపట్టారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు
స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శని వారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాడవాడలా పా రిశుధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించాలి..
రాజాం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత స మాజానికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కాలేపు వీధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, ఐసీడీఎస్ పీవో సన్యాసమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇండక్షన్‌స్టవ్‌ల పంపిణీ
పూసపాటిరేగ, జూలై 18(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని శని వారం పూసపాటిరేగ అంగన్‌వాడీ కేంద్రంలో మార్క్ ఫెడ్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రాలో భాగంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికా హారాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షల బీ మా చెక్కును అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, నాయకులు పిన్నింటి సన్యాశినాయుడు, జగన్నాథం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం..
డెంకాడ, జూలై 18(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశు భ్రతతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే నాగమాధ వి అన్నారు. శనివారం జొన్నాడ పంచాయతీలో నిర్వ హించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం జొన్నాడ సొసైటీని పరిశీలిం చారు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బి.శ్రీని వాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆమె జొన్నాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఇండక్షన్ స్టవ్‌ల ను పంపిణీ చేశారు.
అందరి బాధ్యత..
గజపతినగరం, జూలై 18(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. పురిటిపెంట పంచాయతీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏ సీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, ఎంపీడీవో కల్యాణి, ఈవో జగదీష్ పాల్గొన్నారు.
హరిత నగరంగా తీర్చి దిద్దుదాం..
నెల్లిమర్ల, జూలై 18(ఆంధ్రజ్యోతి): నగర పంచాయ తీని హరిత నగరంగా తీర్చి దిద్దాలని కమిషనర్ కిల్లాన అప్పలరాజు కోరారు. శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆం ధ్ర కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డు శ్రీరాంనగ ర్ కాలనీలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టా రు. మెప్మా సీఎంఎం గేదెల రాము, ఉమాభాస్కర్, తోట రాము, సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి..
కొత్తవలస, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం స్థానిక సబ్బవరం రోడ్డులోని నూకాలమ్మ గుడి సమీపంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, పీఏసీఎస్ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, సింహాచలం ట్రస్టు మెంబర్ మాకెన సీతారామపాత్రుడు, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు పాల్గొన్నారు.