Swami Vivekananda యువతకు మార్గదర్శి.. స్వామి వివేకానంద
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:18 AM
Swami Vivekananda: A Guiding Light for the Youth నేటి యువతరానికి మార్గదర్శి స్వామి వివేకానంద అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు.
పార్వతీపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): నేటి యువతరానికి మార్గదర్శి స్వామి వివేకానంద అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలే వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన యువజ నోత్సవాల వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
19 నుంచి పశు వైద్య శిబిరాలు
జిల్లాలో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. వైద్యులు పశువులను పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తారని, ఉచితంగా టీకాలు నివారణ వేస్తారని తెలిపారు. పాడి రైతులకు పశు పోషణ ఖర్చులు తగ్గించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా దూడలకు క్రమం తప్పకుండా నట్టల నివారణా మందు తాగించడం వల్ల బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మథరావు తెలిపారు. ఈ శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.