అధిక మోతాదులో మాత్రలు మింగి..
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:13 AM
అధిక మోతాదులో మాత్రలు మింగి చికిత్స పొందుతూ మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
చికిత్స పొందుతూ మహిళ మృతి
గజపతినగరం, జూలై 14(ఆంధ్రజ్యోతి): అధిక మోతాదులో మాత్రలు మింగి చికిత్స పొందుతూ మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డొలపేట గ్రామా నికి చెందిన వాసా తిరుమల(28) అనే మహిళ గత కొంతకాలం గా థైరాయిడ్, షుగర్ వ్యాధులతో బాధ పడుతున్నారు. వివాహం తర్వాత ఈ సమస్య అధికం అయ్యింది. ఈక్రమంలో ఈనెల 9వ తేదీన థైరాయిడ్‌కు చెందిన మాత్రలను అధిక మోతాదులో మింగారు. దీంతో పరిస్థితి విషమించింది. వెంటనే కుటంబీకులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించా రు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. మృతురాలికి ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన తలే బాలకృష్ణతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతిరాలి తల్లి వాసా రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.