Share News

పొదుపు నిధుల స్వాహా

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:26 AM

మెం టాడ గ్రామంలో వరలక్ష్మీ పొదుపు సంఘానికి సంబంధించిన రూ.1.20లక్షలను బుక్‌కీపర్‌ లక్ష్మి పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ సభ్యు లు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

పొదుపు నిధుల స్వాహా
నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు

- డ్వాక్రా సంఘం సభ్యుల ఆందోళన

మెంటాడ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మెం టాడ గ్రామంలో వరలక్ష్మీ పొదుపు సంఘానికి సంబంధించిన రూ.1.20లక్షలను బుక్‌కీపర్‌ లక్ష్మి పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ సభ్యు లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాధితుల వివరాల మేరకు.. 2023 సెప్టెంబరు 26న బ్యాంకు లింకేజీ కింద పది మంది సభ్యులు రూ.లక్ష చొప్పున రూ.10 లక్షలు రుణంగా తీసుకున్నారు. క్రమం తప్పకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నారు. బుక్‌ కీపర్‌ లక్ష్మి.. బ్యాంకు సిబ్బందితో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆరుగురి సభ్యుల పేరుతో పొదుపు నిధుల నుంచి రూ.1.20లక్షలు తీసుకుంది. ఈ విషయం సభ్యులకు తెలియడంతో ఆమెను ప్రశ్నించారు. తిరిగి ఆ డబ్బులను బ్యాంకులో జమచేస్తామని లక్ష్మి నమ్మించి సొంతానికి వాడుకుంది. ఈ క్రమంలో గతంలో బాంకు లింకేజీ కింద వాడుకున్న రూ.10లక్షల రుణం ఇటీవల పూర్తిగా తీరిపోయింది. దీంతో గ్రూప్‌ సభ్యులు కొత్త రుణం మంజూరు కోరుతూ బ్యాంకుకు వెళ్లారు. పొదుపు ఖాతాలో కేవలం రూ.20 వేలు ఉందని, కొత్త రుణం ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. ఆరాతీస్తే బుక్‌ కీపర్‌ బండారం బయటపడింది. విషయం ఏపీఎం అన్నపూర్ణ దృష్టికి వెళ్లింది. విచారణలో భాగంగా ఆమె బ్యాంకు సిబ్బందిని కలిసి ఆరా తీశారు.

Updated Date - Mar 21 , 2026 | 12:26 AM