Share News

పాలకొండలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:13 AM

పాలకొండ ఐసీడీఎస్‌ ఆధ్వ ర్యంలో సుస్థిర జీవనశైలి వారోత్సవా లను శనివారం నిర్వహించారు.

పాలకొండలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు
మాట్లాడుతున్న రంగలక్ష్మి:

పాలకొండ, నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): పాలకొండ ఐసీడీఎస్‌ ఆధ్వ ర్యంలో సుస్థిర జీవనశైలి వారోత్సవా లను శనివారం నిర్వహించారు.ఈ సం దర్భంగా ప్రీపైమరీ, ప్రైమరీ పాఠశాల విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, తల్లులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. నీరు, విద్యుత్‌ పొదుపు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు, ఈ-వ్యర్థాల నియంత్రణపై ప్రతిజ్ఞచేయించారు. చిన్న తనం నుంచే సుస్థిర జీవనశైలి అలవరచుకోవాలని అధికారులు సూచించారు. కార్య క్రమంలో సీడీపీవో రంగలక్ష్మి, సూపర్‌వైజర్లు పి.దశరత్నం, ఎస్‌.విస్సమ్మ, ఎన్‌.లావణ్య, ఎన్‌.రాజేశ్వరి, జ్ఞానమ్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2026 | 01:13 AM