Share News

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:13 AM

స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది.

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

గజపతినగరం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెరకము డిదాం మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన బొత్స రాజేష్‌(17) స్థానిక ప్రైవే టు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చదువుతు న్నాడు. గురువారం రాత్రి రాజేష్‌ భోజనానికి మెస్‌కు వెళ్లకుండా రూంలోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు భోజనానికి వెళ్లి.. తిరిగి రూముకు వచ్చి చూడగా రాజేష్‌ అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీంతో కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకు వెళ్లారు. వైద్యుడు సాయి కుమార్‌ విద్యార్థిని పరీక్షించారు. అప్పటికే మృతిచెంది నట్టు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులు లక్ష్మణ, కళకు కళాశాల యాజమాన్యం సమాచారం అందజేసింది. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

Updated Date - Feb 13 , 2026 | 12:13 AM