Share News

వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:26 AM

పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు ఎదురుగా ఉన్న టిఫిన్‌ సెంటర్‌ ప్రాంగణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

 వ్యక్తి అనుమానాస్పద మృతి

రాజాం రూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు ఎదురుగా ఉన్న టిఫిన్‌ సెంటర్‌ ప్రాంగణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఆ వ్యక్తిని ఆదివారం ఉదయం చూసిన స్థానికులు పొలీసులకు సమాచా రం అందించారు. ఈ ఘటన రాజాంలో కలకలం రేపింది. దీంతో రాజాం టౌన్‌ సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ బేగ్‌ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. మృతుడు పట్టణంలోని మాదిగవీధికి చెందిన బాబ్జీ(42)గా గుర్తించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో పాటు రక్తపుమడుగులో పడిఉండడంతో ఇతనిని ఎవరైనా హత్య చేశారా.. ఇతరత్రా కారణాలతో మృతిచెందాడా.. అనే కోణంలో పొలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్లూస్‌టీం రంగంలోకి దిగింది. ఘటనా స్థలి వద్ద ఉన్న పరిస్థితిని పరిశీలించారు. మృతుడి శరీరంపైగా నీ, ఆ ప్రాంతంలో ఉన్న వస్తువులపై గానీ ఎవరివైనా వేలిముద్రలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. మృతుడు బాబ్జీ శ్రీకాకుళం రోడ్‌లోని ఓ డాబాలో ఆరేళ్లుగా వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహమ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:26 AM