Share News

వృద్ధుడి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:15 AM

మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన కిల్లారి రామినాయుడు(68) అనే వృద్ధుడు అనుమానాస్పదంగా మృతిచెం దిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ వి.జనార్దనరావు సోమవారం తెలిపారు.

వృద్ధుడి అనుమానాస్పద మృతి

సంతకవిటి, జూలై 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన కిల్లారి రామినాయుడు(68) అనే వృద్ధుడు అనుమానాస్పదంగా మృతిచెం దిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ వి.జనార్దనరావు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై హెచ్‌సీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామినాయుడు కాళ్లు సరిగ్గా పనిచేయకపోవడంతో స్టాండ్‌ సహాయంతోనే నడు స్తుంటారు. కుటుంబ ఆస్తి విషయంలో తన తమ్ముడితో చాలా కాలంగా వివాదా లు ఉన్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం రామినాయుడు పొలానికి వెళ్లారు. అనంతరం పొలంలో అపస్మారక స్థితిలో పడిపోయినట్టు అందిన సమా చారం మేరకు ఆయన కుమారుడు అక్కడికి చేరుకున్నారు. ఏమి జరిగిందని అడ గ్గా.. తన తమ్ముడు, మరదలు బలవంతంగా గడ్డిమందు తాగించారని రామినా యుడు చెప్పారు. వెంటనే అక్కడ నుంచి రాజాం ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామినాయుడు మృతిచెందారు. మృతుడి భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:15 AM