Share News

హోంగార్డు అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:05 AM

జిల్లా సాయుధ రిజర్వ్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సుంకరి రాము(46) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

హోంగార్డు అనుమానాస్పద మృతి

నెల్లిమర్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లా సాయుధ రిజర్వ్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సుంకరి రాము(46) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఎస్‌ఐ జి.గోపాలరావు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన సుంకరి రాము జిల్లా సాయుధ రిజర్వ్‌లో హోంగార్డుగా పనిచేస్తు న్నారు. ఈయన గురువారం ఉదయం సుమారు 9 గంటలకు పారసాం గ్రామ రెవెన్యూ పరిధిలోని తన పొలానికి గడ్డి కోసేం దుకు వెళ్లారు. చాలా సమయం అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా, ఆయన పొలంలో మరణించి ఉన్నారు. పాము కాటు వల్ల మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 12:06 AM