Share News

అనుమానంతో చెట్లు నరికివేత

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:21 AM

మామిడిపల్లి గ్రామానికి చెంది న సవలాపురపు జోగులు అనే వ్య క్తి ఇటీవల కాలిన గాయాలతో మృతిచెందిన విషయం తెలిసిందే.

అనుమానంతో చెట్లు నరికివేత

సంతకవిటి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యో తి): మామిడిపల్లి గ్రామానికి చెంది న సవలాపురపు జోగులు అనే వ్య క్తి ఇటీవల కాలిన గాయాలతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే దీనికి జోగులు పొలం స మీపంలో ఉన్న పుల్లిట గ్రామానికి చెందిన మామిడితోట యజమానే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు భావించి.. ఆ తోటలోని మామిడిచెట్లను బుధవారం రాత్రి నరికేశారంంటూ పిన్నింటి స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ ఆర్‌.గోపాల రావు తెలిపారు.

పుల్లిటలో పోలీస్‌ పికెట్‌

మామిడి చెట్లు నరికివేత నేపథ్యంలో పుల్లిట గ్రామంలో ఎటువంటి అవాంఛ నీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పికెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:21 AM