సూర్యనారాయణ సేవలు ఎనలేనివి
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:49 PM
దళిత ఉద్యమ నేత, ప్రజా హక్కుల పోరాట యోధుడు బసవ సూర్య నారాయణ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడి నిస్వార్థంగా సేవలు అందించారని, ఆయన సేవలు ఎనలేనివని ఎస్పీ దామోదర్ కొనియాడారు.
ఎస్పీ దామోదర్
విజయనగరం, నవం బరు 6(ఆంధ్రజ్యోతి): దళిత ఉద్యమ నేత, ప్రజా హక్కుల పోరాట యోధుడు బసవ సూర్య నారాయణ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడి నిస్వార్థంగా సేవలు అందించారని, ఆయన సేవలు ఎనలేనివని ఎస్పీ దామోదర్ కొనియాడారు. సూర్యనారాయణ మృతిచెందడంతో శుక్రవారం కణపాకలోని ఆయన స్వగృహంలో ఉంచిన పార్ధివదే హాన్ని ఎస్పీ సందర్శించి.. పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ సూర్యనారాయణ నిస్వార్థంగా సేవలు అందించేవారని అన్నారు. డీబీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ సూర్యనారాయ ణ మరణం దళిత వర్గాలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో బంగార్రాజు, ఎం.చంద్రరావు, సూరప్పడు, కోరుకొండ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.