Suryaghar రూ.176 కోట్లతో సూర్యఘర్
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:34 AM
Suryaghar with an investment of ₹176 Crore జిల్లాలో సుమారు రూ.176 కోట్లతో సూర్యఘర్ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలసలో గిరిజనుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను సోమవారం ప్రారంభించారు.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుమారు రూ.176 కోట్లతో సూర్యఘర్ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలసలో గిరిజనుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు సూర్యఘర్ పథకం కింద 14,110 సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. సాలూరులో 4,300 కనెక్షన్లు మంజూరు చేశాం. ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు వారి ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి నెలా రూ.200 జమ చేస్తుంది. ప్రతి నియో జకవర్గంలో సుమారు 10వేల సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధిహామీ పథకంలో దోపిడీని అరికట్టేందుకు తీసుకొచ్చిన ముఖ ఆధారిత హాజరులో ఇబ్బందులను అదిగమించేందుకు చర్యలు చేపడుతున్నాం. ’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు తిరుపతిరావు, పరమేశు, ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, సోలార్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.