Survey 10లోగా సర్వే పూర్తిచేయాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:20 AM
Survey Must Be Completed Within 10 Days జిల్లా పరిధిలో చేపడుతున్న పలు సర్వేలను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలను డ్వామా పీడీ కె.రామచంద్రరరావు ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పరుగులు పెడుతున్నారు. వాస్తవంగా మన్యంలో సమగ్ర కుటుంబ, సిటిజన్, ఈకేవైసీ సర్వేల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
గరుగుబిల్లి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో చేపడుతున్న పలు సర్వేలను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలను డ్వామా పీడీ కె.రామచంద్రరరావు ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పరుగులు పెడుతున్నారు. వాస్తవంగా మన్యంలో సమగ్ర కుటుంబ, సిటిజన్, ఈకేవైసీ సర్వేల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీనిపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరుకే సర్వేలన్నీ పూర్తి చేయాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అధికారులు లక్ష్యాలను చేరుకోలేకపోయారు. దీంతో తాజాగా మరోసారి వారికి డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే (యూనిఫైడ్) నిర్వహించిన సమయంలో కుటుంబంలో ఫోన్ ఉన్నవారితోపాటు విద్యార్థుల వివరాలను విధిగా పొందుపర్చాలని సూచించారు.మిస్సింగ్ డేటాను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. దీంతో దీంతో మండలాల్లో సిబ్బంది ఇంటింటా సర్వేను నిర్వహిస్తున్నారు. జిల్లాకు 1,60,033 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 87,368 కుటుంబాలు సర్వేను నిర్వహించారు. ఇక రేషన్ కార్డుదాల ఈకేవైసీ విషయానికొస్తే.. 85,986 మందికి గాను 48,652 మందికి ఈకేవైసీ పూర్తి చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం గరుగుబిల్లిలో సిటిజన్ ఈకేవైసీ సర్వే చేపట్టామని ఎంపీడీవో జి.పైడితల్లి తెలిపారు. సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సచివాలయాల సిబ్బందికి సూచించామన్నారు.