Share News

హక్కుల పొందేందుకు సర్వే దోహదం

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:53 PM

: రైతులు వారి భూములకు సంపూర్ణ హక్కులు పొందేందుకు ఈసర్వే దోహదపడుతుందని రేగిడి తహసీల్దార్‌ ఈశ్వరరావు తెలి పారు. బుధవారం మండలంలో కొర్లవలసలో భూసమగ్ర సర్వేపై తహసీల్దార్‌ ఆధ్వ ర్యంలో రీసర్వేపై చైతన్యర్యాలీ నిర్వహించారు.

  హక్కుల పొందేందుకు సర్వే దోహదం
కొర్లవలసలో ర్యాలీ నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది

రేగిడి, సెప్టెంబరు2 (ఆంధ్రజ్యోతి): రైతులు వారి భూములకు సంపూర్ణ హక్కులు పొందేందుకు ఈసర్వే దోహదపడుతుందని రేగిడి తహసీల్దార్‌ ఈశ్వరరావు తెలి పారు. బుధవారం మండలంలో కొర్లవలసలో భూసమగ్ర సర్వేపై తహసీల్దార్‌ ఆధ్వ ర్యంలో రీసర్వేపై చైతన్యర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో కొద్దిరోజుల్లో సర్వే ప్రక్రియ ముగుస్తున్న నేపధ్యంలో రైతులు వారికి చెందిన హక్కు పత్రాలు చూపించుకొనేందుకు, తప్పు ఒప్పులు సరిచేసుకొనేందుకు రెవెన్యూసిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ శంకరరావు, ఎంపీటీసీ హరనాఽథ్‌, రైతులు శ్రీరాములునాయుడు, హరిబాబు, మహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:53 PM