బొబ్బిలిలో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:24 AM
పట్టణంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఎస్పీ సారధ్యంలో జల్లెడ పట్టిన పోలీసులు
బొబ్బిలి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సుమారు 400 మంది పోలీసులతో పట్టణంలోని అన్ని కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అసాంఘికశక్తుల కదలికలపై కన్నేశారు. స్ధానిక జెండా వీధి జంక్షన్ నుంచి వాహనాల తనిఖీని ప్రారంభించారు. హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలను నడుపుతున్న యువ కులను ప్రత్యేకించి అభినందించారు. హెల్మెట్లు ధరించని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రమాదాలు జరిగి అపాయానికి గురైతే కుటుంబ సభ్యులే ఏమవుతారో ఆలోచించారా? అంటూ వారిని సున్నితంగా మందలించారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతోనే నిఘా: ఎస్పీ
గంజాయి రవాణాను ఉక్కుపాదంతో అణిచివేయాలన్న దృక్పథంతో బొబ్బిలిలో రాత్రంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒడిశా సరిహదు ్దప్రాంతం కావడంతో గంజాయి రవాణాకు ఆస్కారం ఉంటుందని 400 మంది పోలీసులతో రాత్రంతా గస్తీ తిరిగి వాహన తనిఖీలను చేపడుతున్నామన్నారు. ఆకతాయిల ఆగడాలను కట్టడి చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నామన్నారు. దొంగతనాలను నివారించడానికి, ప్రజలకు ధైర్యం కలిగించేందుకు కార్యక్రమాన్ని చేపడుతు న్నామన్నారు. ఆయనతో డీఎస్పీ రాకోటి గోవిందరావు, సీఐ కింతలి నారాయణరావు, పలు సర్కిళ్ల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.