ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:20 AM
కేడీ కాలనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేడీ కాలనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి అయ్యారు. వారి చదువుల కోసం ఆరా తీశారు. అనంతరం పాఠశాల స్టాక్ రిజిస్టర్, విద్యార్థుల హాజరును పరిశీలించార మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రగిరిలోని గిరిజన సంక్షేమ పీటీఈ బాలికల నివాస పాఠశాలను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ముఖ్యంగా పీటీఈ గ్రూప్‌నకు చెందిన బాలికల విద్యపై శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిపనులు, విద్యార్థినులకు అందుతున్న వసతులను పరిశీలించారు.