Share News

Suppression of those who question ప్రశ్నించేవారిపై అణచివేత

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:06 AM

Suppression of those who question ప్రశ్నించే మేధావులు, ప్రజాసంఘాల నాయకులను పాలకులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నా రని విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గంటి ప్రసాదం స్మారక భవనంలో కమిటీ ఆధ్వర్యంలో గంటి ప్రసాదం 13వ వర్ధంతి సభను శనివారం నిర్వహించారు.

Suppression of those who question ప్రశ్నించేవారిపై అణచివేత
సభలో మాట్లాడుతున్న విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ

ప్రశ్నించేవారిపై అణచివేత

మావోయిస్టుల అంతానికి పంతం సరికాదు

ఆదివాసీలను తరిమేయడమే కేంద్రం లక్ష్యం

గంటి ప్రసాదం వర్ధంతి సభలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ

బొబ్బిలి, జూలై 4(ఆంధ్రజ్యోతి):

ప్రశ్నించే మేధావులు, ప్రజాసంఘాల నాయకులను పాలకులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నా రని విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గంటి ప్రసాదం స్మారక భవనంలో కమిటీ ఆధ్వర్యంలో గంటి ప్రసాదం 13వ వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. స్మారక కమిటీ ప్రతినిధి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించారు. దేశంలో ఎవరు పాలకులుగా ఉండాలనేది కార్పొరేట్‌శక్తులు నిర్ణయిస్తున్నా యన్నారు. మావోయిస్టులను వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి ముహూర్తం ఖరారు చేసి మరీ అమలు చేస్తున్నారని, దీని అర్థం ఆదివాసీలను ఆ సమయానికల్లా అడవుల నుంచి తరిమేసి భూములను దారాదత్తం చేస్తామని కార్పొరేట్లకు సంకేతం ఇవ్వడమేనని ఆరోపించారు. అడవులకు సెక్యూరిటీ గార్డులుగా ఉన్న ఆదివాసీలను తరిమివేసే కుట్ర అమలవుతోందన్నారు. భారతదేశ విప్లవోద్యమానికి ఉమ్మడి శ్రీకాకుళం, ఉద్దానంలో నాడు శ్రీకారం చుట్టారని, అదే స్ఫూర్తితో గంటి ప్రసాదం ఆధునిక శైలిలో ఉద్యమ రచన చేస్తూ ఆచరించేవారని గుర్తుచేశారు. అమరుల బంధుమిత్రుల సంఘం నేత బి.అంజమ్మ మాట్లాడుతూ గంటి ప్రసాదంను నెల్లూరులో తల్వార్‌లతో హత్యచేసి నేటికి 12 ఏళ్లు అయిందని, ఆయన చూపిన ప్రజా ఉద్యమ బాట సజీవమని అన్నారు. పీకేఎస్‌, డీటీఎఫ్‌, ఇఫ్టూ, పీడీఎం, ఇఫ్టూ సంఘాల నేతలు దర్యోదన, పేడాడ కృష్ణారావు, మెరిగాని గోపాలం, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వామపక్షాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చి ప్రజా పోరాటాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రైతు కూలీలు, చెరకు రైతులు, జూట్‌ కార్మికులు, కళాసీలు, సినీ కార్మికుల సమస్యలపై గంటి ప్రసాదం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశ సంపదను సామ్రాజ్యవాద శక్తులకు కట్టబెట్టడాన్ని ఆయన గట్టిగా నిలదీసేవారన్నారు. తొలుత జెండాను రంపా రాఘవరావు ఆవిష్కరించి ప్రసాదం చిత్రపటానికి పూలమాల వేసి విప్లవాభివందనాలు తెలిపారు. ప్రజాకళామండలి కళాకారులు విప్లవగీతాలను ఆలపించారు. తమటాల అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల సంఘం నేతలతో పాటు రిటైర్డ్‌ రైల్వే అధికారి రంపా రాఘవరావు, పి.శంకరరావు, బొడ్డేపల్లి సత్యనారాయణ, పౌరహక్కుల సంఘం నేత డానేష్‌, వి.లక్ష్మునాయుడు, రాయితీ సత్యం, నల్లి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:06 AM