Share News

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:29 AM

పేదలకు అండగా సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ
లబ్ధిదారులతో మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరులోని క్యాంప్‌ కార్యాలయంలో రూ.9 లక్షల 87 వేల 512 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. పట్టణంలోని 13వ వార్డులోని మండలం శ్రీనివాసరావుకు రూ.లక్షా 65 వేల 585, 21వ వార్డులోని అల్లు ఈశ్వరరావుకు రూ.44,368, 28వ వార్డులోని జమ్ము రాముకు రూ.88,210, 14వ వార్డులోని లచ్చుభూక్త పద్మావతికి రూ.32028, 7వ వార్డులోని తాడివలస గుణశేఖర్‌కు రూ.64,859, 23వ వార్డులోని జక్కు రాములుకు రూ.67,470, 29వ వార్డులోని బూర్లి ప్రవీణ్‌కుమార్‌కు రూ.3 లక్షల 50 వేల 72 చెక్కులను అందజేశారు. అలాగే పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన తిర్లింగి అక్షయకు రూ.15 వేలు, గురివి నాయుడుపేటకు చెందిన ఈదుబిల్లి అనూరాధకు రూ.60,637, పి.కోన వలసకు చెందిన నల్లమిల్లి శ్రీనివాస రెడ్డికి రూ.48,237, మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన కొండపల్లి జియాంష్‌కు రూ.87,440 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోం దన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పౌరుడికి మద్దతుగా ప్రభుత్వం చర్యలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తల ఉన్నారు

Updated Date - Apr 09 , 2026 | 12:29 AM