Share News

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:50 PM

రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడిచిపెట్టడం వల్ల మత్స్యసంపదను పెంపొందించడంతోపాటు మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం పీఎంఎంఎస్‌వై పథకం ఉద్దేశమని మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో) జె. శ్రీనివాస్‌ తెలిపారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
గడిగెడ్డ రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడిచిపెడుతున్న అధికారులు :

గుర్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడిచిపెట్టడం వల్ల మత్స్యసంపదను పెంపొందించడంతోపాటు మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం పీఎంఎంఎస్‌వై పథకం ఉద్దేశమని మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో) జె. శ్రీనివాస్‌ తెలిపారు. బుధ వారంమండలంలోని పకీరకిట్టలిలోని గడిగెడ్డ రిజర్వాయర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లక్షా 9 వేల చేపపిల్లలను విశాఖ మత్స్య సహాయ సంచాలకులు బి.సురేష్‌కుమార్‌ సమక్షంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ చేపల ఉత్పత్తి పెంపొందించడం, జలవనరులను సద్వినియోగం చేసు కోవడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మత్స్యశాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Updated Date - Nov 18 , 2026 | 11:50 PM