Share News

Village Development పల్లెల అభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - May 25 , 2026 | 11:52 PM

Support Needed for Village Development పల్లెల అభివృద్ధికి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామ పంచాయతీల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు.

 Village Development పల్లెల అభివృద్ధికి సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, మే25(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధికి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామ పంచాయతీల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, డీపీవో రవీంద్ర , పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు

జిల్లావాసులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని, పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రజలకు వేగంగా సేవలందించాలన్నారు. అధికారులు పారదర్శకంగా వ్యహరించాలని సూచించారు. అర్జీలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలన్నారు. భూమి రికార్డుల్లో మార్పులు కచ్చితంగా ఉం డాలని ఆదేశించారు. అర్హులకు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:52 PM