Share News

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు సహకరించండి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:06 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అందరూ సహకరించాలని, తల్లిదండ్రులను ఈ విషయంలో చైతన్యం చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు సహకరించండి: ఎమ్మెల్యే
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అందరూ సహకరించాలని, తల్లిదండ్రులను ఈ విషయంలో చైతన్యం చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. మంగళవారం మలిచర్ల గ్రామంలో ఆమె ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాఽధ్యాయులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె మలిచర్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాఽథమిక విద్యపై దృష్టి సారించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

వైద్య శిబిరం ...

విజయనగరం మండల పరిధిలోని మలిచర్ల గ్రామాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పీ-4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అక్కడ హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలిచర్ల గ్రామంలో రానున్న ఆరు నెలల కాలంలో ఐదు పర్యాయాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మలిచర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా లో ఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Apr 22 , 2026 | 12:06 AM