super Museum అదరహో బొబ్బిలి మ్యూజియం
ABN , Publish Date - May 17 , 2026 | 11:57 PM
super Museum బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది.. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు.. ఎవరెవరు పాల్గొన్నారు... నాటి రాజులు వినియోగించిన సింహాసనాలు, పరికరాలు ఎలా ఉంటాయి.. రాజులు వేటాడిన జంతువుల చర్మాలు చూడాలనుకుంటున్నారా... అరుదైన చాయాచిత్రాలు, పల్లకీల కథాకమామీషు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే బొబ్బిలి కోటలోని మ్యూజియం చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
అదరహో బొబ్బిలి మ్యూజియం
కళ్లకు కట్టే చిత్రాలు, ఆయుధాలు
సాహసాల చిహ్నాలు
వీరుల విగ్రహాలు
అబ్బురపరిచే కట్టడాలు
నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది.. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు.. ఎవరెవరు పాల్గొన్నారు... నాటి రాజులు వినియోగించిన సింహాసనాలు, పరికరాలు ఎలా ఉంటాయి.. రాజులు వేటాడిన జంతువుల చర్మాలు చూడాలనుకుంటున్నారా... అరుదైన చాయాచిత్రాలు, పల్లకీల కథాకమామీషు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే బొబ్బిలి కోటలోని మ్యూజియం చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
బొబ్బిలి, మే 17(ఆంధ్రజ్యోతి):
చరిత్రలో బొబ్బిలికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1757లో బొబ్బిలి-విజయనగరం రాజుల మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి రాజులు ఓటమి చెందినప్పటికీ వారి శౌర్యం, పరాక్రమం ఇప్పటికీ వేనోళ్లా కథలుగా చెప్పుకుంటున్నారు. ఇందులో తాండ్ర పాపారాయుడు ప్రదర్శించిన పరాక్రమంతో పాటు శత్రువులకు లొంగకూడదన్న తెగువతో రాణిమల్లమ్మదేవి ఆమె పరివారమంతా చేసిన ఆత్మబలిదానం బొబ్బిలి చరిత్రకు మకుటాయమానంగా నిలిచిపోయింది. ఆ ఘన చరిత్ర బొబ్బిలిలో నేటికీ మ్యూజియం రూపంలో పదిలంగా కనిపిస్తోంది. 1893-98 మధ్య రాజా వీఎస్ రంగారావు బహదూర్ నేతృత్వంలో నిర్మించిన దర్బారు మహల్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. రాజవంశీయుడు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కెకె రంగారావు (బేబీనాయన) చొరవతో మ్యూజియం అపూర్వంగా రూపుదిద్దుకుంది. దేశ, విదేశీ ప్రముఖులు సైతం చూసేందుకు తరలివస్తుంటారు. బెల్జియన్ గ్లాస్‌మిర్రర్స్, టెక్స్‌టైల్స్ పరికరాలు, పోలోస్టిక్స్, ఐవరీ అండ్ రోజ్ ఉడ్‌తో తయారు చేసిన పరికరాలు, వన్యప్రాణుల చర్మాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. మ్యూజియం సమీపంలోనే రాజులు వినియోగించిన ఖరీదైన కార్లు కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఇందులో వింటేజ్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.