Share News

Kotadurga Amma కోటదుర్గమ్మకు కిరణ స్పర్శ

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:21 AM

Sunlight Touches Kotadurga Amma ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మను మంగళవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.30 గంటల నుంచి 9 నిమిషాల పాటు గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టును భానుడి కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

 Kotadurga Amma  కోటదుర్గమ్మకు కిరణ స్పర్శ
కోటదుర్గమ్మకు తాకిన సూర్యకిరణాలు

పాలకొండ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మను మంగళవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.30 గంటల నుంచి 9 నిమిషాల పాటు గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టును భానుడి కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో ఒక్క నవంబరు నెలలో మాత్రమే ఇలా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీ ప్రసాదశర్మ, ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. గతంలో అమ్మవారి పాదాల వరకే సూర్యకిరణాలు తాకేవని చెప్పారు. అయితే ఆలయ విస్తరణ , వాస్తు నిర్మాణాలు పూర్తిచేయడంతో అమ్మవారి మూలవిరాట్టుపై పూర్తిగా సూర్య కిరణాలు పడుతున్నట్లు వెల్లడించారు. మొత్తంగా కోటదుర్గమ్మ ఆలయంలో కిరణ స్పర్శ భక్తులకు కనువిందు చేసింది.

Updated Date - Nov 18 , 2026 | 12:21 AM