sun effect భానుడి భగభగ
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:27 AM
sun effect ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఎండ ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థుల పరిస్థితి దారుణంగా వుంది
భానుడి భగభగ
43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత
అల్లాడిపోతున్న జిల్లా ప్రజలు
విజయనగరం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఎండ ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థుల పరిస్థితి దారుణంగా వుంది. హైబీపీ, లోబీపీ ఉన్నవారు ఇళ్లకే పరిమితమౌతున్నారు. ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, బార్లీ వంటివి ఎక్కువగా వినియోగిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక వ్యాపారులు కూడా దుకాణాలను తెరవడం లేదు. మరోవైపు విజయనగరం, ఎస్‌కోట, రాజాం, బొబ్బిలి, గజపతినగరం, డెంకాడ కూడళ్లు మధ్యాహ్నం వేళ వెలవెలబోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండ ప్రభావం వుంటే, మే నెలలో ఏ విధంగా వుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రాంతం పేరు ఉష్ణోగ్రతలు
(డిగ్రీలు)
దత్తిరాజేరు 43.5
రాజాం 43.4
రేగిడి 43.2
బొబ్బిలి 43.0
====================================