Share News

Boat Rides! బోటు షికారుకు వేసవి దెబ్బ!

ABN , Publish Date - May 25 , 2026 | 12:05 AM

“Summer Heat Hits Boat Rides! అధిక ఎండల నేపథ్యంలో తోటపల్లిలో పర్యాటకుల సందడి తగ్గింది. ఇక్కడున్న ఐటీడీఏ పార్కుకు కూడా అంతంతమాత్రంగానే సందర్శకులు వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బోటు షికారుకు గతంలో పర్యాటకులు ఆసక్తి చూసేవారు. అయితే ఎండలు ఒకవైపు, మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండడంతో బోటు షికారుకు ఎవరూ అంతగా మొగ్గు చూపడం లేదు.

 Boat Rides! బోటు షికారుకు వేసవి దెబ్బ!
గుర్రపు డెక్క నడుమ చిక్కుకున్న పర్యాటకశాఖ, ఐటీడీఏ బోట్లు

గరుగుబిల్లి, మే24(ఆంధ్రజ్యోతి): అధిక ఎండల నేపథ్యంలో తోటపల్లిలో పర్యాటకుల సందడి తగ్గింది. ఇక్కడున్న ఐటీడీఏ పార్కుకు కూడా అంతంతమాత్రంగానే సందర్శకులు వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బోటు షికారుకు గతంలో పర్యాటకులు ఆసక్తి చూసేవారు. అయితే ఎండలు ఒకవైపు, మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండడంతో బోటు షికారుకు ఎవరూ అంతగా మొగ్గు చూపడం లేదు. ఇదిలా ఉండగా ఇక్కడున్న రెండు ప్రధాన బోట్లు మరమ్మతులకు గురికావడంతో చిన్నపాటి బోట్లునే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో స్పీడ్‌ బోటు, కయల్‌ (తెడ్డుతో నడిచే) బోట్లు, ఫెడరల్‌ బోటు అందుబాటులో ఉన్నాయి. మూలకు చేరిన బోట్లుపై అధికారులు దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఐటీడీఏ ఏఈ జి.తిరుపతిరావును వివరణ కోరగా ‘పర్యాటక, ఐటీడీఏలకు చెందిన బోట్లు మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. అని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 12:06 AM