Share News

భార్య మందలించిందని ఆత్మహత్య

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:09 AM

మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త పురుగు మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య మందలించిందని ఆత్మహత్య

ఎస్‌.కోట రూరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త పురుగు మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబం ధించి సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కోనయ్యపాలెం గ్రామానికి చెందిన వీరవరపు లక్ష్మణరావు(47), తన భార్య లక్ష్మితో కలిసి ఆరునెలల కిందట ఎస్‌.కోట మండలంలోని మామిడిపల్లిలో ఓ వ్యక్తి వద్ద ఇటుకుల తయారుచేసే పనికి వచ్చారు. ఈమేరకు ఇక్కడే పాక వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే లక్ష్మణరావు తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో ఈనెల 20న తాగివచ్చిన భర్త ను లక్ష్మి మందలించింది. దీంతో లక్ష్మణరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపో యాడు. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో భార్య, అక్కడున్న వారు చూట్టుపక్కల గాలించారు. ఈక్రమంలో సమీపంలో ఉన్న మరో ఇటుకుల బట్టీ వద్ద లక్ష్మణరావు మంచంపై పడుకుని ఉండడాన్ని గుర్తించారు. నోటి వెంట నురగ లు రావడం, పక్కనే పురుగు మందు డబ్బా ఉండడాన్ని గమనించారు. వెంటనే ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో విజయనగరం తరలిస్తుండగా మార్గమ ధ్యంలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:09 AM