ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ABN , Publish Date - May 10 , 2026 | 12:34 AM
ఫైనాన్స్ వ్యాపారంలో ఆర్థిక నష్టం రావడంతో మానసిక వేదనకు గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యాపారంలో నష్టం రావడంతోనే..
పార్వతీపురంటౌన్, మే 9 (ఆంధ్రజ్యో తి): ఫైనాన్స్ వ్యాపారంలో ఆర్థిక నష్టం రావడంతో మానసిక వేదనకు గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం కొత్తవల స రాజీవ్ కొత్తపోలమ్మ కాలనీకి చెందిన రౌతు కృష్ణ పెద్దకు మారుడు శివకుమార్ (33) కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఫైనాన్స్ నడుపుతున్నాడు. అయితే ఫైనాన్స్ వల్ల ఆర్థికంగా నష్టం కలగడంతో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కొంతవ రకు అప్పులు తీర్చారు. అయినప్పటికీ ఇంకా అప్పులు ఉండడంతో గత కొన్ని నెలలుగా శివకుమార్ తన నివాసంలో ఉంటూ తీవ్రమైన మానసికమైన వేదనకు గురైయ్యాడు. శనివారం వేకువజాము న 4 గంటల సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకు న్నాడు. కుటుంబ సభ్యులు గుర్తిం చి పట్టణ పోలీసులకు తెలియజేశారు. ఎస్‌ఐ గోవిందరావు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి విచార ణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.