ఆర్డీవోగా సుధారాణి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:24 AM
చీపురుపల్లి ఆర్డీవో ఎం.సుధారాణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
చీపురుపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): చీపు రుపల్లి ఆర్డీవో ఎం.సుధారాణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన ఆమె బదిలీపై చీపురుపల్లి వచ్చా రు. బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావును రాజాంలోని ఆయ న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభు త్వ పథకాలు సక్రమంగా అమలు కావడంలో తగిన పాత్ర తీసుకోవాలని కోరారు.