Share News

Sub-Depots గిరిజనుల కోసమే సబ్‌ డిపోలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:57 PM

Sub-Depots Established Exclusively for Tribal Communities గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసమే సబ్‌ డిపోలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సవిల్‌ సప్లైస్‌ శాఖాధికారి (డీఎస్‌వో) బి.అశోక్‌ తెలిపారు. శిలగాం గ్రామంలో నూతన ఏర్పాటు చేసిన జీసీసీ సబ్‌ డిపోను శనివారం ఆయన ప్రారంభించారు.

Sub-Depots  గిరిజనుల కోసమే సబ్‌ డిపోలు
లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న డీఎస్‌వో అశోక్‌

సీతంపేట రూరల్‌, జూన్‌6(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసమే సబ్‌ డిపోలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సవిల్‌ సప్లైస్‌ శాఖాధికారి (డీఎస్‌వో) బి.అశోక్‌ తెలిపారు. శిలగాం గ్రామంలో నూతన ఏర్పాటు చేసిన జీసీసీ సబ్‌ డిపోను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులకు సమీపంలో జీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నామన్నారు. సీతంపేట మండలంలో 25సబ్‌డిపోల ఏర్పాటు చేయనున్నామన్నారు. మొదటివిడతగా 12 సబ్‌డిపోల ద్వారా గిరిజన లబ్ధిదారులకు రేషన్‌సరుకులు అందిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన 13 సబ్‌డిపోలకు స్టాక్‌ సరఫరా చేసేందుకు రవాణా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించి .. సబ్‌డిపోల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సంధ్యారాణి, తహసీల్దార్‌ శ్రీకన్య, ఎంపీడీవో మిశ్రో, జీసీసీ బీఎం డి.కృష్ణారావు, ఆర్‌ఎస్‌డీటీ శ్రీవిద్య, కూటమి నాయకులు పవన్‌, చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:57 PM