Share News

పాఠశాలలో సబ్‌ కలెక్టర్‌ తనిఖీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:22 AM

అవలంగిలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో సబ్‌ కలెక్టర్‌ తనిఖీ
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌

పాలకొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అవలంగిలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విద్యాభ్యాసం, పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాల కోసం ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారుల వివరాలు పరిశీలించడంతో పాటు పోషణ్‌ యాప్‌లో నమోదైన సమాచారాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువును పరిశీలించి వారి ఎదుగుదల, పోషకాహార స్థితిగతులను ఆయన సమీక్షించారు.

Updated Date - Nov 18 , 2026 | 12:24 AM