ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:12 AM
పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉత్తీర్ణత సాధించాలన్న తపన, పట్టుదలతో చదవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కోరారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉత్తీర్ణత సాధించాలన్న తపన, పట్టుదలతో చదవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. పరీక్షలకు ఇంకా సమయం ఉండడంతో నిరిష్ట ప్రణాళికల ప్రకారం చదువుకోవాలని పిలుపునిచ్చారు. మనస్సును అదుపులోకి ఉంచుకొని ఒత్తిడిని జయించి సరదాగా, సంతోషంగా ఆనందంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో శతశాతం మార్కులు వచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లా డారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలంటే చదువు అనేది ఒక మెట్టు అని తెలిపారు. విద్యార్థులు పరీక్షలపట్ల భయాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవా లన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పదో తరగతి, ఇంటర్మీడియట్ కీలకమని తెలిపారు. సమయాన్ని వృఽథా చేసుకోకుండా విద్యా ప్రమాణాలు ఉన్నతీకరించుకోవడా నికి నిరంతరం శ్రమ అలవర్చుకోవాలన్నారు.కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు, జిల్లా ఇంట ర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.