Share News

జాతీయ స్థాయిలో మెరిసిన విద్యార్థులు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:40 AM

అటవీ శాఖ కాకినాడ డివిజన్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించిన బీఏ స్పారో హీరో జాతీయ స్థాయి కథారచన పోటీల్లో పెంట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని మర్రాపు జయశ్రీ సీనియర్‌ విభాగంలో ప్రథమ స్థానం సాధించింది.

జాతీయ స్థాయిలో మెరిసిన విద్యార్థులు
ప్రిన్సిపల్‌ సెక్రటరీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న జయశ్రీ

బొబ్బిలి రూరల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ కాకినాడ డివిజన్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించిన బీఏ స్పారో హీరో జాతీయ స్థాయి కథారచన పోటీల్లో పెంట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని మర్రాపు జయశ్రీ సీనియర్‌ విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. రెండోస్థానంలో టి.లాస్య, జూనియర్‌ విభాగంలో మూడో స్థానం ఎన్‌.ప్రణీత, డ్రాయింగ్‌ జూనియర్‌ విభాగంలో నాలుగో స్థానం జి.అశ్వినికుమార్‌ సాధించారు. బర్డ్‌ నెస్ట్‌ మేకింగ్‌ వీడియో జూనియర్‌ విభాగం ఐదోస్థానంలో ఎన్‌.ప్రణీత నిలిచారు. కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతీలాల్‌ దండే చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందుకున్నారు. కార్యక్రమంలో గైడ్‌ టీచర్లు కె.సింహాచలం, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Jul 27 , 2026 | 12:40 AM