Share News

మాక్‌ అసెంబ్లీలో విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:06 AM

నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన అమరావతి మాక్‌ అసెంబ్లీ పోటీల్లో పట్టణంలోని హడ్కోకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

మాక్‌ అసెంబ్లీలో విద్యార్థుల ప్రతిభ
విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

పాలకొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన అమరావతి మాక్‌ అసెంబ్లీ పోటీల్లో పట్టణంలోని హడ్కోకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. డిబేటింగ్‌ విభాగంలో కుప్పిలి గీతిక, వ్యాసరచన విభాగంలో కుమ్మరి భవానీ ప్రథమ స్థానాలు సాధించారు. దీంతో జిల్లాస్థాయిలో నిర్వహించనున్న తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. విద్యార్థులు జిల్లాస్థాయి పోలీలకు ఎంపాక కావడంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు.

Updated Date - Nov 12 , 2026 | 12:06 AM