Share News

విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:03 AM

విద్యార్థులు అన్ని విభాగాల్లో నైపుణ్యం పెంచుకోవా లని ఏపీ మోడల్‌ స్కూల్‌ కేంద్ర ప్రత్యేకా ధికారి నీరాజ్‌కుమార్‌ గయాజీ కోరారు.

 విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
ల్యాబ్‌ను పరిశీలిస్తున్న నీరాజ్‌కుమార్‌ గయాజీ:

భోగాపురం, ఫిబ్రవరి25(ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు అన్ని విభాగాల్లో నైపుణ్యం పెంచుకోవా లని ఏపీ మోడల్‌ స్కూల్‌ కేంద్ర ప్రత్యేకా ధికారి నీరాజ్‌కుమార్‌ గయాజీ కోరారు. బుధవారం భోగాపురం సమీపంలో గల ఏపీ మోడల్‌స్కూల్‌ పరిసరాలు, తరగతి గదులు, క్రీడాస్థలం, ఎండీఎం, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాల గురించి తెలుసుకొన్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్‌, డీఈవో మాణిక్యాల నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు, ప్రిన్సిపాల్‌ సంధ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:03 AM