పీటీఎంలో సమస్యలపై నిలదీసిన విద్యార్థులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:34 AM
గురవాం కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో గందరగోళం నెలకొంది.
రాజాం రూరల్, జూలై 24(ఆంధ్రజ్యోతి): గురవాం కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో గందరగోళం నెలకొంది. సమావే శానికి విచ్చేసిన అధికారుల ఎదుట విద్యార్థులు వారి సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి తల్లిదండ్రులు వంత పాడారు. గత రెండేళ్లుగా పాఠశాల ప్రాం గణంలోనే మురుగునీరు నిలిచిపోయిందని, మరుగుదొడ్లుకు తలుపులు లేవని, స్నానం చేసే గదుల వద్ద, ప్రహరీ వద్ద ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు పడుతు న్నామని బాలికలు వాపోయారు. ఈ ప్రాంతంలో గంజాయి సేవించేవారు ఎక్కు వగా ఉంటున్నారని, అర్ధరాత్రి వేళ పాఠశాలలోకి చొరబడితే బాలికల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు సిబ్బందిని నిలదీశారు. ఉదయం 8.30 గంటల తర్వాత టిఫిన్ ఇస్తున్నారని, కొన్ని సందర్భాలలో చపాతీలు తమతోనే చేయిస్తున్నారని, సరిగ్గా చపాతీలు రాకపోతే మొహంపై విసిరికొడుతున్నారని, స్టీలు పళ్లాలు విసురుతున్నారని విద్యార్థులంతా వాపోయారు.
డ్రైనేజీ సమస్య వాస్తవమే..
పాఠశాలలో డ్రైనేజీ సమస్య ఉంది. పాఠశాల నుంచి బయటవరకూ ప్రస్తు తం కాలువ పనులు జరుగుతున్నాయి. కాలువ నిర్మాణం కోసం ప్రహరీ పడగొట్టా ల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నా విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు.
- సావిత్రి, ప్రిన్సిపాల్, కేజీబీవీ, గురవాం