పరీక్ష పేపర్లను విద్యార్థులే దిద్దుకుంటున్నారు
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM
విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను ఉపాఽధ్యాయులు దిద్ది మార్కులు వేయాలి. కానీ, బొబ్బిలి మండలం కలవరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం విద్యార్థులే శనివారం తమ పేపర్లను దిద్దుకో వడం కనిపించింది.
- విశ్రాంతి తీసుకుంటున్న టీచర్లు
- కలవరాయి పాఠశాలలో వెలుగుజూసిన ఘటన
బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను ఉపాఽధ్యాయులు దిద్ది మార్కులు వేయాలి. కానీ, బొబ్బిలి మండలం కలవరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం విద్యార్థులే శనివారం తమ పేపర్లను దిద్దుకో వడం కనిపించింది. మార్కులను సైతం వారే రికా ర్డుల్లో నమోదు చేశారు. ఉపాధ్యాయులు చేయాల్సిన ఈ పనిని విద్యార్థులకు అప్పగించి వారు మాత్రం విశ్రాంతి తీసుకుంటూ మూకుమ్మడి చర్చల్లో నిమగ్న మయ్యారు. ఈ నెల 22 లోగా విద్యార్థుల మార్కులను దశలవారీగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయులు తమ ఇళ్లకు పశ్నాపత్రాలను తీసుకుని వెళ్లి దిద్దుబాటు చేసి, అనంతరం మార్కు లను ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. కానీ, ఆ పనిని విద్యా ర్థులకు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. దీనిపై హెచ్‌ఎం మల్లేశ్వరరావును వివరణ కోరగా.. పేపర్లను దిద్దేందుకు అబర్వర్‌ను నియమిం చామని, ఆ టీచర్ ఎక్కడికో వెళ్లినట్లున్నారని సమాధా నమిచ్చారు. ఇదే అంశంపై డీఈవో మాణిక్యంనా యుడును వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసు కుంటామన్నారు. ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను దిద్ది మార్కులు వేసిన తర్వాత వాటిని విద్యార్థులకు అందజేస్తారని, వారు ఇళ్లకు తీసుకెళ్లి తల్లిదండ్రులు చూపుకోవచ్చని చెప్పారు. అంతేగానీ.. విద్యార్థులు ప్రశ్నపత్రాలను దిద్దడం సరికాదని అన్నారు.