Share News

విద్యార్థి సంఘాల బంద్‌ ప్రశాంతం

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:55 AM

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లాలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరి గింది.

విద్యార్థి సంఘాల బంద్‌ ప్రశాంతం
కోట జంక్షన్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

  • కోట జంక్షన్‌ వద్ద రాస్తారోకో

విజయనగరం దాసన్నపేట, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లాలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరి గింది. విద్యార్థులు స్వచ్చందంగా తరగతులు బహిష్కరించారు. కొన్నికళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నించగా.. విద్యార్థి సంఘాల నాయకులు బస్సులను అడ్డుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, డీవైఎఫ్‌ఐ కన్వీనరు హారీష్‌ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్రప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని, ప్రశ్నించే వారిపైన నిరంకుశ పద్ధతుల్లో నిర్బంధాన్ని విధిస్తోందని ఆరోపించారు. ఛలో పార్లమెంటు కార్యక్రమంలో విద్యార్థులపై భాష్పవాయువు ప్రయోగించిన ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయాలని, లేకుంటే విద్యార్థుల పోరాటాన్ని ఐక్యం చేసి ప్రభుత్వ పతనానికి పునాది వేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jul 25 , 2026 | 12:55 AM