Share News

ప్రాణం తీసిన మొబైల్‌

ABN , Publish Date - May 15 , 2026 | 12:30 AM

క్షణికావేశం నిండుప్రాణాన్ని బలిగొంది.

ప్రాణం తీసిన మొబైల్‌

  • ఫోన్‌ ఇవ్వలేదని మనస్తాపానికి గురై..

  • విద్యార్థిని ఆత్మహత్య

తెర్లాం, మే 14 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం నిండుప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులు మొబైల్‌ ఫోన్‌ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణం ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. అమ్మానాన్న పొలానికి వెళ్లగానే ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. స్థానికుల సహాయంతో కొనఊపిరితో ఉన్న కుమార్తెను కిందకు దించి ఆస్పత్రి కి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బందు వుల రోదనలతో రాజాం ఏరియా ఆసుపత్రి నిండిపోయింది. హృదయ విధారకర మైన ఈ సంఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని జగన్నాథవల సలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాథవలస గ్రామానికి చెందిన వ్యవసాయకూలీలు రామ్‌కుమార్‌, హేమలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో అనుష్క(16) ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తిచేసి బెటర్‌మెంట్‌ కోసం సన్నద్ధం అవుతోంది. గురువారం ఉదయం పొలానికి వెళ్తన్న తల్లిదండ్రుల్ని ప్రిపరేషన్‌ కోసం మొబైల్‌ఫోన్‌ ఇమ్మని కోరింది. ‘నాలుగురోజుల్లో పరీక్షలున్నాయి.. సెల్‌ ఎందుకు, చదువుకోమని’ చెప్పి రామ్‌కు మార్‌, హేమలత తమ చిన్నకుమార్తెతో కలిసి పొలానికి వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కరే ఉండడం, తల్లిదండ్రులు మొబైల్‌ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన అనుష్క క్షణికావేశంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. పొలం పనులు పూర్తయ్యాక గురువారం మధ్యాహ్నం ఇంటి కి చేరుకున్న రామ్‌కుమార్‌, హేమలతలు ఇంటి తలుపులు తెరిచేసరికి ఎదురుగా ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తె అనుష్కను చూసి బావురుమన్నారు. స్థానికుల సహకారంతో ఆమెను కిందికి దింపారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కూతు రు బతుకుతుందేమోన్న ఆశతో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి కే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి వద్ద తల్లిదండ్రు ల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 15 , 2026 | 12:30 AM