Buildings in Ruins ఖాళీలతో సతమతం ... భవనాలు శిథిలం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:18 AM
Struggling with Vacancies… Buildings in Ruins జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువైద్యశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కులుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరోవైపు పాడి రైతులు కూడా పశు వైద్యశాలలకు వెళ్లేందుకు ఆలోచించాల్సి వస్తోంది. పరిస్థితి దయనీయంగా ఉండడంతో కొన్నిచోట్ల పరాయి పంచన పశు వైద్యశాలలు, డిస్పెన్సరీ యూనిట్లను నిర్వహిస్తున్నారు.
పూర్తిస్థాయిలో లేని వైద్యులు .. వేధిస్తున్న సిబ్బంది కొరత
బిక్కుబిక్కుమంటూ విధులు.. పాడి రైతులకు తప్పని అవస్థలు
పార్వతీపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువైద్యశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కులుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరోవైపు పాడి రైతులు కూడా పశు వైద్యశాలలకు వెళ్లేందుకు ఆలోచించాల్సి వస్తోంది. పరిస్థితి దయనీయంగా ఉండడంతో కొన్నిచోట్ల పరాయి పంచన పశు వైద్యశాలలు, డిస్పెన్సరీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 38 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో 17 పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఉల్లిభద్ర, చిలకలపల్లి, జియ్యమ్మవలస, చినమేరంగి, తుమరాడ, భాసూరు, విశ్వనాఽథపురం తదితర వెటర్నరీ డిస్పెన్సరీలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో ఏడు పశువైద్యశాలల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పార్వతీపురంతో పాటు పాలకొండ, కురుపాం తదితర చోట్ల భవనాలు శిథిలా వస్థకు చేరడంతో .. పరాయిపంచన నిర్వహిస్తున్నారు.
పోస్టులు ఖళీ ఇలా..
ఇన్‌చార్జి జిల్లా పశు వైద్యాధికారిగా పార్వతీపురం అసిస్టెంట్ డైరెక్టర్ దీనకుమార్ విధులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. అసిస్టెంట్ సర్జన్‌లు 38 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. వెటర్నరీ అసిస్టెంట్లు 23 పోస్టులు ఉండగా 13 మంది మాత్రమే ఉన్నారు. యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ 241 మంది ఉండాల్సి ఉండగా 238 మంది ఉన్నారు. ఇకపోతే జిల్లా స్థాయి పశువైద్యాధికారికి వాహన సదుపాయం కూడా లేదు. దీనిపై ఇన్‌చార్జి జిల్లా పశు వైద్యాధికారి దీనకుమార్‌ను వివరణ కోరగా.. ‘జిల్లాలో పశువైద్యశాలల భవనాలతో పాటు డిస్పెన్సరీ యూనిట్ల పరిస్థితిపై నివేదికను ప్రభుత్వా నికి అందించాం. సొంత వాహనంలో జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నాం.’ అని తెలిపారు.