Share News

తాగునీటికి అవస్థలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:33 AM

తమకు ప్రతిరోజూ తాగునీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని ధర్మవరం ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్య క్తం చేశారు.

తాగునీటికి అవస్థలు

  • సక్రమంగా సరఫరా కాని వైనం

  • ఖాళీ బిందెలతో ధర్మవరం ఎస్సీ కాలనీ మహిళల నిరసన

ఎస్‌.కోట రూరల్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): తమకు ప్రతిరోజూ తాగునీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని ధర్మవరం ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్య క్తం చేశారు. పంచాయతీ కుళాయిల ముందు శనివా రం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గతంలో స్థానిక హైస్కూల్‌ వద్ద నీటి సరఫరా ఉండేటప్పుడు బాగానే నీరు వచ్చేదని, తర్వాత వేరేగా హైస్కూల్‌ ట్యాంకు నుంచి నీరు ఇచ్చిన దగ్గర్నుంచి సక్రమంగా నీరు రావడం లేదన్నారు. ఈ ట్యాంక్‌ నిర్వహణ చూసే వ్యక్తి సమయ పాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యహ రించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయ ని వారు వాపోయారు.

ఈ విషయం పై ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ భాస్కర్‌ వివరణ కోరగా.. వెంటనే పంచాయతీ ఈవోతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని, సిబ్బంది కచ్చితంగా పనిచేసేలా చూస్తామన్నారు.

పంచాయతీ ఈవో కృష్ణమోహాన్‌ వివరణ కోరగా.. ట్యాంకుకు మరమ్మతులు చేయిస్తున్నా మని, ఇక నుంచి కచ్చితమైన వేళల్లో నీటి సరఫరా చేస్తామని తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 12:33 AM