Share News

Women’s Safety మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - May 29 , 2026 | 10:50 PM

Strong Measures for Women’s Safety జిల్లాలో మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే సహించేది లేదన్నారు.

  Women’s Safety  మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు
విలేఖర్లతో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘ మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి గత రెండేళ్లలలో జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.. దండయాన్‌ కార్యక్రమం ద్వారా సాంకేతికత సాయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరగా అరెస్ట్‌ చేసి శిక్ష పడేలా చేశాం. మహిళలను హత్య చేసిన మూడు కేసులనే ఛేదించి ముగ్గురికి జీవిత ఖైదు, అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన ఐదు కేసుల్లో నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒకరికి పదేళ్లు, మరొకరికి మూడేళ్లు, ఇంకొకరికి రెండేళ్ల శిక్ష పడేలా చర్యలు చేపట్టాం. నాలుగు పోక్సో కేసుల్లో నలుగురికి శిక్ష , అత్యాచారం కేసుల్లో నలుగురికి పదేళ్లు, ఒకరికి ఏడాది, వరకట్నం వేధింపుల కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు మహిళలను వేధించిన కేసుల్లో ఇద్దరికి రెండు రోజుల పాటు జైలు శిక్షను సంబంధిత న్యాయస్థానాలు విధించాయి. గత రెండేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 30 మందిపై హిస్టరీ షీట్స్‌ను తెరచి.. వారిపై నిరంతర నిఘా ఉంచాం. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పులు గుణపాఠం, వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేరు.’ అని తెలిపారు. ఆయన వెంట ఏఏఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2026 | 10:50 PM