Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:56 PM

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 82 మంది మత్స్యకారులకు 75 శాతం రాయితీపై మంజూరైన ద్విచక్ర వాహనాలు, చేపల వలలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 682 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారన్నారు. అర్హులైన ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.28.97 విలువైన 25 ద్విచక్ర వాహనాలు ఐస్‌బాక్సులతో, రూ.8.46 లక్షల విలువైన 57 నాణ్యమైన చేపల వలలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. గతంలో మత్స్యకారులు బుట్టలతో చేపలు సైకిళ్లపై తీసుకెళ్లి విక్రయించే వారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దీనివల్ల మధ్యవర్తులు లేదా దళా రుల ప్రమేయం లేకుండా పూర్తి లాభం మత్స్యకారులకే దక్కుతుంద న్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను అర్హులైన మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి టి.సంతోష్‌కుమార్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి యు.చాందిని, మత్స్యశాఖ సహాయ తనిఖీదారు ఎస్‌.దుర్గారావు, మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:56 PM