Share News

నియోజకవర్గం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:09 AM

యోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం నెల్లిమర్ల నగర పంచా యతీలోని నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో రూ.2.45 కోట్లతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులను శంకుస్థాపనచేశారు.

 నియోజకవర్గం అభివృద్ధికి కృషి
అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నాగమాధవి

నెల్లిమర్ల, జూలై 29(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం నెల్లిమర్ల నగర పంచా యతీలోని నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో రూ.2.45 కోట్లతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులను శంకుస్థాపనచేశారు. కమిషనర్‌ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పట్టణ విభాగం అధ్యక్షుడు రవ్వా నాని, యువజన విభాగం అధ్యక్షుడు అప్పికొండ రవికుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనా ప్రసాద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ఎంఎం. నాయుడు, పలిశెట్టి దొరబాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:09 AM