Share News

100% Results శతశాతం ఫలితాలకు కృషి

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:09 AM

Striving for 100% Results పదో తరగతిలో శతశాతం ఫలితాల సాధనకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. శనివారం శివరాంపురం, పాచిపెంటలో జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలను ఆకస్మికంగా సందర్శించారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న వంద రోజుల ప్రణాళికను పరిశీలించారు.

  100% Results శతశాతం ఫలితాలకు కృషి
పాచిపెంటలో పాఠశాలను పరిశీలిస్తున్న డీఈవో బ్రహ్మాజీరావు

సాలూరు రూరల్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి ): పదో తరగతిలో శతశాతం ఫలితాల సాధనకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. శనివారం శివరాంపురం, పాచిపెంటలో జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలను ఆకస్మికంగా సందర్శించారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న వంద రోజుల ప్రణాళికను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ముందంజలో ఉండే విధంగా తర్ఫీదు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. స్లిప్‌ టెస్ట్‌ ద్వారా పరీక్షలంటే భయాన్ని పోగొట్టాలని తెలిపారు. సమయాన్ని బట్టి కౌన్సిలింగ్‌, యోగ, వ్యాయమం తదితర వాటిని చేయించాలన్నారు. అనంతరం పాచిపెంట ఎంఈవో కార్యాలయాన్ని పరిశీలించి విద్యాభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత యడ్లవీఽధి పాఠశాలను పరిశీలించారు. సీఎంఆర్టీలు, ఎల్డీఏ, ఎంఐఎస్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్వతీపురం ఉప విద్యాధికారి బత్తుల రాజకుమార్‌ పాచిపెంట మండలంలో బడ్నాయకవలస, పద్మాపురం, వేగగానివలస తదితర పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలును పరిశీలించారు.

Updated Date - Feb 01 , 2026 | 12:09 AM