Share News

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:26 AM

పార్టీ బలోపేతానికి నాయ కులు, కార్యకర్తలు కృషిచేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయి నుంచి అందరూ సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

 టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పార్టీ బలోపేతానికి నాయ కులు, కార్యకర్తలు కృషిచేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయి నుంచి అందరూ సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో టీడీపీ నగర, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గంటా రవి, పీతల కోదండరామ్‌, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడు పాల్గొన్నారు.కాగా నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 6 లక్షల 52 వేల 767 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

Updated Date - Sep 24 , 2026 | 12:26 AM