Share News

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:19 AM

నగరంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతిఒక్క రూ కృషి చేయాల ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): నగరంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతిఒక్క రూ కృషి చేయాల ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. నగరంలోని 44వ డివిజన్‌కు చెందిన విశ్రాంత ఉపా ధ్యాయురాలు మత్స్య భవానీ, ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పలనాయుడు, గౌరీ, రమణి తదిత రుల ఆధ్వర్యంలో 150 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ నగర అధ్యక్షుడు గంటా రవి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆమె కండువాలు వేసి ఆహ్వానించారు.

వ్యాపారవేత్తలను తయారు చేయడమే లక్ష్యం..

విజయనగరం టౌన్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారుచేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నా రు. శుక్రవారం విజయనగరంలోని పేర్లవారి కూడలి వద్ద మెప్మా ఆధ్వర్యంలో ముద్ర రుణం పొందిన సూర్యకుమారి అనే మహిళ పేరుతో ఏర్పాటుచేసిన రీచ్‌ మైస్టోర్‌ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మూడవ రీచ్‌ మైస్టోర్‌ను జిల్లా కేంద్రంలో ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందన్నారు. నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి, మెప్మా పీడీ చిట్టిరాజు, బ్యాంకు ప్రతినిధులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పత్తిగిల్లి సూర్యకుమారి, సిటీ మిషన్‌ మేనేజర్‌ సన్యాసిరావు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:19 AM