Share News

శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:45 PM

జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో మాణిక్యంనాయుడు ఆదేశించారు.

శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి
మాట్లాడుతున్న డీఈవో మాణిక్యంనాయుడు

బాడంగి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో మాణిక్యంనాయుడు ఆదేశించారు. మంగళవారం బాడంగి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కంటే అధిక శాతం టెన్త్‌ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్నారు. దానికి అనుగుణంగా రోజూ విద్యార్థులకు స్టడీ అవర్స్‌ నిర్వహించాలన్నారు. సబ్జెక్టు వారీగా ప్రణాళిక తయారు చేసి వారికి బోధించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అధికంగా ట్రిపుల్‌ ఐటీ సీట్లు సాధించారన్నారు. గతేడాదికి మించి ఈఏడాది ట్రిపుల్‌ ఐటీకి విద్యార్థులు ఎంపికయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దత్తి సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:46 PM