Share News

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:28 PM

జిల్లాలో నేరాలను అరికట్టేందుకు, శాంతిభద్రత లను పరిరక్షించేందుకు కఠిన చర్యలు చేపడు తున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం తెలిపారు.

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

- ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

- ముగ్గురిపై పీడీ యాక్ట్‌

విజయనగరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాలను అరికట్టేందుకు, శాంతిభద్రత లను పరిరక్షించేందుకు కఠిన చర్యలు చేపడు తున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా వేపాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితు లుగా ఉన్న వేపాడ మండలం బొద్దాం గ్రామా నికి చెందిన మొహమ్మద్‌ అహ్మద్‌ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు అనే వ్యక్తు లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి విశాఖ సెం ట్రల్‌ జైలుకు తరలించామన్నారు. ఈ ముగ్గు రిపై హిస్టరీ షీట్లు ఉన్నాయని, ఒక్కొక్కరిపై 15కు పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నా యని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, చైన్‌ స్నాచింగ్‌, రోబరీ, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, భూదురాక్ర మణకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతూ సమాజానికి ప్రమాదకరంగా మారితే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి నిందితు లను గుర్తించి, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టడానికి వెనుకాడబోమన్నారు. నిందితులు నత్ప్రవర్తనతో మెలగాలని, చ ట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని కోరారు.

Updated Date - Jul 03 , 2026 | 11:28 PM